తెలంగాణ

telangana

ETV Bharat / city

Lokesh On Child Deaths: 'ఆ చిన్నారుల మరణాలు.. జగన్ సర్కారు నిర్లక్ష్యపు హత్యలు' - nara lokesh comments on government

Lokesh On Child Deaths In West Godavari: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా బోడిగూడెంలో అంతుచిక్కని జ్వరాలతో నలుగు చిన్నారులు మృతి చెందటంపై తెదేపా నేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అవి జగన్ సర్కారు నిర్లక్ష్యపు హత్యలని ఆయన ఆరోపించారు. ప‌రిస్థితి విష‌మించ‌క‌ముందే... యుద్ధ ప్రాతిప‌దిక‌న వైద్య బృందాల‌ను గ్రామానికి పంపి అంతుచిక్కని జ్వరానికి కార‌ణాలు తెలుసుకోవాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Lokesh On Child Deaths: 'ఆ చిన్నారుల మరణాలు..జగన్ సర్కారు నిర్లక్ష్యపు హత్యలు'
Lokesh On Child Deaths: 'ఆ చిన్నారుల మరణాలు..జగన్ సర్కారు నిర్లక్ష్యపు హత్యలు'

By

Published : Dec 5, 2021, 10:54 PM IST

Nara Lokesh On Child Deaths: ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా బోడిగూడెంలో అంతుచిక్కని జ్వరాలతో న‌లుగురు చిన్నారులు మృత్యువాత‌ప‌డి, యాభై మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా... ప్రభుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌టం లేదంటూ తెదేపా నేత నారా లోకేశ్ మండిపడ్డారు. గ‌త కొన్ని వారాలుగా ప‌దిహేనేళ్ల లోపు గల చిన్నారులు వేర్వేరు ల‌క్షణాలు, జ్వరాల‌తో బాధ‌ప‌డుతుంటే.. వైద్యారోగ్యశాఖ‌ అధికారులు ప‌ట్టించుకునే స్థితిలో లేక‌పోవ‌టం దారుణ‌మ‌న్నారు. చిన్నారుల మరణాలు.. జగన్ సర్కారు నిర్లక్ష్యపు హత్యలని దుయ్యబట్టారు.

రాష్ట్రంలోని పిల్లలంద‌రికీ తాను మేనమామనంటూ ప్రకటించుకునే ముఖ్యమంత్రి జగన్.. వారు ప్రమాదంలో ఉంటే పట్టించుకోరా? అని నిలదీశారు. పిల్లల బాగుకోరేవారు మేన‌మామ అవుతారే కానీ.. చావుకోరే వారు కాదన్నారు. ప‌రిస్థితి విష‌మించ‌క‌ముందే.. యుద్ధ ప్రాతిప‌దిక‌న వైద్య బృందాల‌ను గ్రామానికి పంపి అంతుచిక్కని జ్వరానికి కార‌ణాలు తెలుసుకోవాల‌ని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న 50 మందికిపైగా చిన్నారులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాల‌ని ప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details