Nara Lokesh : నాటుసారాపై వాస్తవాలు బయటకొస్తాయని ఏపీ ప్రభుత్వం భయపడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. మద్యంలో రసాయనాలు ఉన్నాయనే ల్యాబ్ రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని.. నిజాలు బయటపడతాయని చర్చ నుంచి పారిపోతున్నారని విమర్శించారు.
తమకు ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు లేదా ? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో ప్రజా సమస్యలు చర్చించమంటే సభాపతి మార్షల్స్‌ను రమ్మంటున్నారంటూ ఎద్దేవా చేశారు. మంత్రులు బొత్స, కొడాలి నాని తరహాలో మా సభ్యులు ఎవ్వరూ ప్రవర్తించట్లేదన్నా లోకేశ్.. గతంలో కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్న షరీఫ్‌ను బొత్స కులం పేరుతో దూషిస్తే.. కొడాలి నాని ఛైర్మన్ టేబుల్ ఎక్కారంటూ ఆరోపించారు.
ఈ కొత్త సంప్రదాయాన్ని మునుపెన్నడూ చూడలేదు..