సేవ్ తాడిపత్రి అనే నినాదమే తన గెలుపునకు కారణమని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగానే కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా జరిగిందని ఆయన అన్నారు. తాడిపత్రి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులనూ త్వరలోనే కలుస్తానని వ్యాఖ్యానించారు. తాడిపత్రి అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే నిధులు తెస్తే.. ఆయన చెప్పిన వారికే కాంట్రాక్ట్ పనులను ఇస్తామని స్పష్టం చేశారు.
'తాడిపత్రి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలుస్తా' - thadipathri latest news
ఏపీలో ఆసక్తిరేపిన అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు తెదేపా వశమైంది. మున్సిపల్ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తాడిపత్రి అభివృద్ధి కోసం త్వరలోనే సీఎం జగన్‌తో పాటు మంత్రులను కలుస్తానని తెలిపారు.
'తాడిపత్రి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలుస్తా'
తాడిపత్రిలో గత 30 సంవత్సరాలుగా ఇలా ప్రశాంతంగా ఎన్నడూ ఎన్నికలు జరగలేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. ఛైర్మన్ గా తెదేపా అధికారంలోకి వచ్చినా... తాడిపత్రి అభివృద్ధి కోసం అన్ని విధాలా చేయూతను అందిస్తామని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి:రైతులకు ఎంపీ అరవింద్ క్షమాపణ చెప్పాలి: భట్టి