తెలంగాణ

telangana

ETV Bharat / city

వలస కూలీల కోసం తెదేపా నేత సాయం - వలసకూలీలకు చెప్పుల పంపిణీ

లాక్​డౌన్ నేపథ్యంలో కాళ్లకు చెప్పులులేకుండానే స్వగ్రామాలకు వెళ్తున్న కూలీల బాధలు చూసి పలువురు దాతలు స్పందిస్తున్నారు. వారికి తోచిన సాయం చేస్తున్నారు. తెదేపా నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ లక్షరూపాయలు విలువచేసే చెప్పులును వలసకూలీల కోసం అందించారు.

sandals-to-migrant
వలస కూలీల కోసం తెదేపా నేత సాయం

By

Published : May 18, 2020, 10:53 AM IST

మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్న కూలీల దీనస్థితిని గమనించి దాతలు వారికి సాయం చేస్తున్నారు. తెదేపా నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ లక్షరూపాయలు విలువచేసే పాదరక్షలను వలసకూలీలకు ఇవ్వాలంటూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమల రావుకి అందజేశారు. వలస కార్మికుల సహాయం కోసం వీటిని అందించానని ఆయన తెలిపారు.

ఇదీచూడండి. నిర్మాణానికి ధరాఘాతం.. ఉపాధి కోల్పోయిన కార్మికులు

ABOUT THE AUTHOR

...view details