CHINTAMANENI: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. తనను హత్య చేసేందుకు షూటర్‌ను నియమించినట్లు ఓ అగంతకుడు ఫోన్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గన్‌మెన్ జీతాలకు డబ్బు చెల్లించే స్థోమత లేదని.. పోలీసులే భద్రత కల్పించాలని ఫిర్యాదులో కోరారు. తనకు ప్రాణహాని ఉందని ఇటీవల ఏలూరు కోర్టులో చింతమనేని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి..: