తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి రెండురోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు(CHANDRABABU TOUR). మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం రానున్న చంద్రబాబు... ఇవాళ, రేపు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తొలిసారిగా చంద్రబాబు నియోజకవర్గానికి రానుండటంతో తెదేపా శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి.
CHANDRABABU TOUR: నేడు కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన - తెలంగాణ వార్తలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి రెండురోజుల పాటు ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు(CHANDRABABU TOUR). కుప్పం పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని పలువురు తెదేపా నాయకుల ఇళ్లకు చంద్రబాబు వెళ్లనున్నారు. ఇవాళ, రేపు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
చంద్రబాబు టూర్, చంద్రబాబు పర్యటన వార్తలు
కుప్పం పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని పలువురు తెదేపా నాయకుల ఇళ్లకు చంద్రబాబు వెళ్లనున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా కుప్పం వ్యాపార సంఘాల నేతలు, సభ్యులతో సమావేశం కానున్నారు.
ఇదీ చదవండి:'అర్ధ నగ్నంగా ఉండమంటాడు.. మూత్రం తాగమంటాడు'