తెలంగాణ

telangana

ETV Bharat / city

రఘురామను గాయపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు

ఎంపీ రఘురామకృష్ణరాజును గాయపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ప్రవర్తించడం దారుణమన్న చంద్రబాబు... కస్టడీలో ఉండేవారిని కొట్టే హక్కు పోలీసులకు లేదని స్పష్టం చేశారు.

chandrababu on raghurama
chandrababu on raghurama

By

Published : May 15, 2021, 9:00 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కళ్లలో ఆనందం కోసం చట్టాల్ని ఉల్లంఘించి ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు గాయపరిచారని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ ఘటనకు కారకులైన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించటం అనాగరికమన్న చంద్రబాబు... ఒక ఎంపీని అక్రమ కేసులో ఇరికించి శారీరక హింసకు గురిచేయటం పోలీసుల దమనకాండకు నిదర్శనమని ఆక్షేపించారు.

చట్ట ప్రకారం కస్టడీలో ఉండేవారిని కొట్టే హక్కు పోలీసులకు లేదన్న చంద్రబాబు... ఏపీ పోలీసులకు ఆ మినహాయింపు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ చర్యలు రాజ్యాంగ వ్యవస్థలో ఫ్యాక్షన్​ను తలపిస్తున్నాయని విమర్శించారు. రఘురామ నడవలేని పరిస్థితిలో ఉన్నారంటే ఆయనను ఎంత హింసించారో అర్థమవుతోందన్నారు. గూండాల్లా వ్యవహరించిన పోలీసు అధికారుల తీరును ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని కోరారు.

ఇవీచదవండి: 'రఘురామ గాయాలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి'

ABOUT THE AUTHOR

...view details