తెలంగాణ

telangana

ETV Bharat / city

Buddha Venkanna Arrest : బుద్దా వెంకన్న అరెస్ట్.. అర్ధరాత్రి విడుదల - తెలంగాణ వార్తలు

Buddha Venkanna Arrest : తెదేపా నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని పునరుద్ఘాటించారు.

Buddha Venkanna Arrest , buddha updates
బుద్దా వెంకన్న అరెస్ట్

By

Published : Jan 25, 2022, 11:07 AM IST

Updated : Jan 25, 2022, 12:08 PM IST

Buddha Venkanna Arrest: తెదేపా నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చేసిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బుద్దా వెంకన్న... తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని పునరుద్ఘాటించారు. డీజీపీ సవాంగ్.. ఏపీ సీఎం జగన్​కు తొత్తుగా పని చేస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలు చట్టవిరుద్ధమైతే కొడాలి నాని చేసినవి చట్టబద్ధమా..? అని ప్రశ్నించారు.

"నేను మాట్లాడిన మాటలు వాస్తవమే. డీజీపీ సవాంగ్‌.. సీఎం జగన్‌కు తొత్తుగా పనిచేస్తున్నారు. నా వ్యాఖ్యలు చట్టవిరుద్ధమైతే కొడాలి నాని చేసినవి చట్టబద్ధమా? మంత్రి కొడాలి నాని 3 ఏళ్లుగా అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి..?"

- బుద్దా వెంకన్న, తెదేపా నేత

సంక్రాంతికి గుడివాడలో క్యాసినో నిర్వహించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఆ క్యాసినోలో డీజీపీ వాటా ఉన్నందునే ఆ రాష్ట్ర మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవడం లేదంటూ బుద్దా వెంకన్న మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబు ఇంటివైపు వస్తే కొడాలి నానిని చంపడానికైనా.. తాను చావడానికైనా సిద్ధమన్నారు. ఈ క్రమంలో ఆయన్ను ప్రశ్నించేందుకు సిద్ధమైన పోలీసులు బుద్దా నివాసానికి భారీగా వచ్చారు. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య అరెస్ట్ చేశారు. మరోవైపు బుద్దా వెంకన్నను అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు.

బుద్దా వెంకన్న బెయిల్​పై విడుదల

ఏపీ మంత్రి కొడాలి నాని, డీజీపీ సవాంగ్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టైన తెదేపా నేత బుద్దా వెంకన్న బెయిల్‌పై విడుదల అయ్యారు. పోలీసులు ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చి స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. మీడియా సమావేశంలో బుద్దావెంకన్న ఏపీ మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు అయనను అరెస్ట్‌ చేసి విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్​పై విడుదల చేశారు.

బుద్దా వెంకన్న అరెస్ట్.. అర్ధరాత్రి విడుదల

ఇదీ చదవండి:గంజాయి ముఠా బీభత్సం.. కారు వదిలేసి చెరువులో దూకిన స్మగ్లర్లు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 25, 2022, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details