తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఆ పార్టీకి రాజీనామా చేస్తారని వస్తున్న ప్రచారంపై స్పందించారు. రాజీనామా విషయం నిజమేనా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఇప్పుడేమీ మాట్లాడబోనని మాత్రం చెప్పారు.
తెదేపాకు రాజీనామా వార్తలపై.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందన ఇదే..!
12:28 August 19
తెదేపాకు రాజీనామా ప్రచారంపై స్పందించని బుచ్చయ్య చౌదరి
తెదేపా సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు బుచ్చయ్య చౌదరి. ఇప్పటి వరకు 6 సార్లు తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు తెదేపా ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఉప సభానాయకుడిగా ఉన్నారు. తాజాగా.. ఆయన పార్టీని వీడనున్నారన్న వార్తలు.. హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడేమీ మాట్లాడను.. అని గోరంట్ల ఇచ్చిన సమాధానం.. చర్చనీయాంశమైంది.
తెదేపా ఆవిర్భావం నుంచి బుచ్చయ్య చౌదరి పార్టీలో ఉన్నారు. 1995లో తెదేపా సంక్షోభంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ వెంటే ఉండి పార్టీని నడిపించారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించారు.
ఇదీ చదవండి: ETELA RAJENDER: "కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే 'దళితబంధు' రాష్ట్రమంతా అమలుచేయాలి"