తెలంగాణ

telangana

ETV Bharat / city

తెదేపాలో వర్గ పోరు ఉండదు అంతా‌ చంద్రబాబు వర్గమే: బొండా ఉమా - Andhra Pradesh latest news

ఏపీలో విజయవాడ మేయర్ అభ్యర్థి ఎంపికలో‌ వివాదం ఉంటే తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. పార్టీలో వర్గ పోరు ఉండదని స్పష్టం చేశారు. నాయకులు ఓపికతో ఉండాలని సూచించారు.

tdp-leader-bonda-uma-on-disputes-in-party
తెదేపా వర్గపోరు లేదన్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా

By

Published : Feb 22, 2021, 9:07 PM IST

ఆంధ్రప్రదేశ్​ తెదేపాలో వర్గ పోరు ఉండదని.. అంతా‌ చంద్రబాబు వర్గం మాత్రమే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. చిన్నచిన్న వివాదాలు ఉన్నా వాటిని జోక్యం చేసుకొని అధినేత పరిష్కరిస్తారన్నారు. ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు ఆదేశాలను అందరూ గౌరవిస్తారని వెల్లడించారు. మేయర్ అభ్యర్థుల ఎంపికలో‌ వివాదం ఉంటే ఆయనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

విజయవాడ మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా నిర్ధరణ కాలేదని బొండా పేర్కొన్నారు. అధిష్ఠానం ఎవరి పేరు సూచిస్తే వారికే తమ సహకారం ఉంటుందని తెలిపారు. అప్పటి వరకు నాయకులు ఓపికతో ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఇదీ చదవండి: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల సందడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details