తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రశ్నిస్తే.. అసభ్యకర పోస్టులు పెడతారా? ఐ-తెదేపా నేత అనూష - వైకాపా నేతల పోస్టులపై తెదేపా నేత అనుష ఆగ్రహం

ANUSHA: తెదేపా మహిళల మనోభావాలు దెబ్బతీసేలా వైకాపా నేతలు... అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఏపీలోని తెదేపా నేత అనూష ఆరోపించారు. వర్రా రవీందర్ రెడ్డి మార్ఫింగ్ చేసి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రవీందర్ రెడ్డిపై సీఎం జగన్... చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

Anusha is the spokesperson of AP-I-TDP
ఏపీ ఐ-తెదేపా అధికార ప్రతినిధి అనూష

By

Published : Sep 15, 2022, 11:32 AM IST

ANUSHA: ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినందుకు.. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో వైకాపా నేతలు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్​లోని ఐ-తెదేపా అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి.. తెదేపా మహిళా కార్యకర్తల చిత్రాలను మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నాడు.

అంతేకాకుండా ఆ వ్యక్తి అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని ఆమె మండిపడ్డారు. మహిళలను అక్కచెల్లెమ్మలుగా సంబోధించే సీఎం జగన్.. రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెదేపా మహిళల జోలికొస్తే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. అటువంటి నీచరాజకీయాలు మానుకోని, మహిళల పట్ల గౌరవాన్ని పెంచుకోవాలని సూచించారు.

వైకాపా నేతలు అసభ్యకర పోస్టులు పెడుతున్నారు..


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details