ANAM VENKATA RAMANAREDDY ON LIQUOR SCAM: దిల్లీ లిక్కర్ కుంభకోణంలో వైఎస్ భారతి, ఎంపీ విజయసాయిరెడ్డి సూత్రధారులని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. దిల్లీలో తీగలాగితే.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్ భారతి నడుపుతున్న జగతి పబ్లికేషన్స్‌కు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌కు ఆర్థిక సంబంధాలున్నాయని ఆరోపించారు. క్విడ్ ప్రోకో-1లో జగతి పబ్లికేషన్స్‌కి.. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కోట్ల రూపాయలు మళ్లించిందన్నారు.
జగన్ కేసుల్లో ఏ5గా ఉన్న ట్రైడెంట్, అదే సంస్థ అధిపతి పెనాక శరత్ చంద్రారెడ్డి ఏ8గా ఉన్నారని వెల్లడించారు. దిల్లీ మద్యం కుంభకోణంలో వీళ్లదే కీలకపాత్రని ఆరోపించారు. అదాన్ డిస్టిలరీస్ ద్వారా అక్రమంగా సంపాదించిన రూ. 5వేల కోట్ల సొమ్మును దిల్లీ స్కాంలో ఉపయోగించినట్లు చెప్పారు. ప్రస్తుత అదాన్ డైరెక్టర్ శ్రీనివాస్, విజయసాయి రెడి అల్లుడు రోహిత్ రెడ్డి నాలుగు కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారన్నారు.