మొన్నటి వరకూ.. పార్టీ కార్యక్రమాలంటే.. వేల మంది కార్యకర్తలు... నేతలకు జయ జయ ధ్వనాలు... పార్టీ సైనికులంతా.. ఒక్కసారి అరిస్తే.. ఆ సందడే వేరు. ఇక ఏటా జరిగే.. మహానాడు అంటే.. 'తెలుగు' తమ్ముళ్లకు పెద్ద పండగే. ఎక్కడున్నా.. కార్యక్రమానికి వచ్చి వాలిపోతారు. అయితే... ఈసారి.. 'పసుపు పండగ' డిజిటల్ ఫ్లాట్ ఫాం పైకి చేరింది. ఆన్లైన్లోనే జెండా ఆవిష్కరించింది.
తెదేపా.. జూమ్.. జూమ్
జూమ్ యాప్.. ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫాం పై వచ్చిన ఓ పెద్ద మార్పు. మీటింగ్లు పెట్టాలన్నా.. గ్రూప్ డిస్కషన్స్ చేయాలన్నా.. టక్కున గుర్తొస్తుందీ పేరు. కానీ లక్షల మంది కార్యకర్తలతో తెదేపా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడును.. ఈ డిజిటల్ ఫ్లాట్ ఫాంపై నిర్వహించడమనేది.. పెద్ద ప్రయోగమే. మహానాడు అంటే.. తెదేపాకు అత్యంత ప్రతిష్ఠాత్మకం. కార్యకర్తలతో మమేకమయ్యే.. పెద్ద సమావేశం. అలాంటిది.. కరోనా కారణంగా.. బాధ్యతగా.. డిజిటల్ ఫ్లాట్ ఫాం వైపు అడుగులేసింది. దేశంలోనే ఇలా ఓ పార్టీకి చెందిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం నిర్వహించడమనేది తెదేపాకే చెల్లింది. పది.. ఇరవై మంది.. కాదు ఏకంగా 14 వేల మందితో ఇలా వర్చువల్ మహానాడును తెదేపా నిర్వహించింది.
భవిష్యత్లో ఇంతేనా..?