కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు.. నేడు ఆంధ్రప్రదేెశ్‌లోని అన్ని జిల్లాల్లో ఉన్న కొవిడ్ ఆసుపత్రులను సందర్శించనున్నారు. 'బాధితులకు భరోసా' పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెదేపా కేంద్ర కార్యాలయం తెలిపింది.
కొవిడ్ ఆస్పత్రులకు తెదేపా నేతలు.. 'బాధితులకు భరోసా'! - అన్ని జిల్లాల్లో తెదేపా బాధితులకు భరోసా కార్యక్రమం వార్తలు
నేడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఉన్న కొవిడ్ ఆసుపత్రులను.. తెలుగుదేశం పార్టీ నాయకులు సందర్శించనున్నారు. 'బాధితులకు భరోసా' పేరుతో.. రోగులకు అందుతున్న వైద్య సహాయం, మందులు, భోజనం ఇతర సదుపాయాల గురించి తెలుసుకోనున్నారు.

నేడు కొవిడ్ ఆస్పత్రులకు తెదేపా నేతలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొంది. కొవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలను పార్టీ నేతల బృందం పరిశీలించి.. కరోనా రోగులకు అందుతున్న వైద్య సహాయం, మందులు, భోజనం ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకోనున్నారు.
ఇదీ చదవండి:కరోనా ప్రభావం: పూలు... పశువులపాలు