తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ మంత్రులను బర్తరఫ్​ చేయాలి: తెదేపా - గవర్నర్​ను కలిసిన తెదేపా నేతలు

ఎస్‌ఈసీని బెదిరించే విధంగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి, బొత్సలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని తెదేపా నేతలు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​ను కోరారు. పంచాయతీ ఎన్నికల్లో ఉద్యోగులు నిస్పక్షపాతంగా విధులు నిర్వర్తించకుండా మంత్రులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మంత్రులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్​కు ఫిర్యాదు చేశారు.

tdp complaint to governor  on ap ministers
ఏపీ మంత్రులను బర్తరఫ్​ చేయాలంటూ తెదేపా ఫిర్యాదు

By

Published : Jan 28, 2021, 7:19 PM IST

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఉద్యోగులు నిస్పక్షపాతంగా విధులు నిర్వర్తించకుండా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈసీని బెదిరించే విధంగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి, బొత్సలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. ఎస్ఈసీపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా, బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. డీఎన్ఏ గురించి మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటని ఆక్షేపించారు. ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్టారెడ్డి వ్యవహార శైలిపైనా ఫిర్యాదు చేశామన్న నేతలు... గవర్నర్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూస్తామని పేర్కొన్నారు.

ఇదీచదవండి :ఉత్తర, దక్షిణ భారత్​కు వారధిగా హైదరాబాద్​: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details