ఏపీ పురపాలక ఎన్నికల్లో రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు పెట్టినా తెదేపా శ్రేణులు గట్టిగా పోరాడారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. నేతలు, కార్యకర్తలు పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారని.. వారి పోరాటస్ఫూర్తికి వందనాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
కార్యకర్తలారా.. ఎవరూ నిరుత్సాహపడొద్దు: చంద్రబాబు - chandrababu speaks on municipal elections results
ఏపీ పురపాలక ఎన్నికల ఫలితాలపై తెదేపా శ్రేణులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నో ప్రలోభాలు, బెదిరింపులను సైతం ఎదుర్కొని గట్టి పోటీనిచ్చారని ప్రశంసించారు.
కార్యకర్తలారా.. ఎవరూ నిరుత్సాహపడొద్దు: చంద్రబాబు
ఫలితాల విషయానికి వస్తే.. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఏపీ భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదామని పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీచూడండి:ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్..