ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు మరో ప్రజా ఉద్యమం అవసరం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యమం కోసం అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు చేపట్టే ఈ ప్రజా ఉద్యమానికి.. తెదేపా నాయకత్వం వహిస్తుందన్నారు. రాష్ట్రం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని.. అవసరమైతే జైలుకైనా వెళ్తామని చంద్రబాబు వెల్లడించారు.
‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’:రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని చంద్రబాబు విమర్శించారు. తమపై కేసులు పెడితే భయపడమని.. ప్రజా సమస్యలపై పోరాడుతామని చెప్పారు. రాష్ట్ర పరిస్థితి చూసి బాధ, ఆవేదన కలుగుతున్నాయన్నారు. కాకినాడలో తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల తెదేపా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పాల్గొని.. మాట్లాడారు. ఈ సందర్భంగా ‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అని ఆయన పిలుపునిచ్చారు.
సజ్జల స్టేట్మెంట్లను హోంమంత్రి చదువుతున్నారు:‘‘నిన్న ముగ్గురు ఆడబిడ్డలపై అత్యాచారం జరిగింది. హోం శాఖ మంత్రి తల్లుల పెంపకంపై మాట్లాడటం సిగ్గుచేటు. సజ్జల రాసిన స్టేట్మెంట్లను ఆమె చదువుతున్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి అందరూ ఉద్యమించాలి. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చి రూ.కోట్లు సంపాదించే అవకాశం కల్పిస్తే.. జగన్ వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి రూ.5 వేలు పడేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను జగన్ అంధకారం చేస్తున్నారు. కరెంట్ బిల్లులను 40 శాతం పెంచారు. కరెంట్ రాదు కానీ.. బిల్లులు మాత్రం బాదుడే బాదుడు. జంగారెడ్డిగూడెం సారా మరణాలు సహజ మరణాలంటూ కొట్టిపారేశారు.
నాకు సీఎం పదవి కొత్త కాదు..: