ఏపీలోని.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
'స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో విఫలమయ్యారు' - వైకాపా పై తెదేపా అధినేత చంద్రబాబు తాజా వ్యాఖ్యలు
ఏపీ, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. సీఎం.. గత నెల 6న స్టీలు ప్లాంట్ అంశంపై ప్రధానికి మొదటి లేఖ రాశారన్న ఆయన.. అప్పటి నుంచి వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవటానికి చేసిన కృషి ఎంటో తెలపాలన్నారు.
'స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో సీఎం విఫలమయ్యారు'
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించిన పరిణామాలపై.. సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోస్కో ప్రతినిధులతో మాట్లాడినా.. తాను మాట్లాడలేదంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.