తెలంగాణ

telangana

ETV Bharat / city

Chandrababu comments: 'సీపీఎస్‌ రద్దుపై జగన్ హామీ ఏమైంది?'

Chandrababu comments: సీపీఎస్‌ రద్దుపై జగన్ హామీ ఏమైందని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో కొందరు పేటియం బ్యాచ్​లా తయారయ్యారని ఆరోపించారు.

Chandrababu
Chandrababu

By

Published : Dec 15, 2021, 5:08 PM IST

Chandrababu Comments: సీపీఎస్‌ రద్దుపై జగన్ హామీ ఏమైందని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. హామీ నెరవేర్చని జగన్ ఇప్పుడేం చెబుతారన్నారు. కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలా జగన్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు.

రెండున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాన్ని దారుణంగా ధ్వంసం చేశారని మండిపడ్డారు. 3 టాయిలెట్లు కూడా కట్టలేని జగన్ 3 రాజధానులు కడతారా? అని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం దిల్లీలో బిచ్చం ఎత్తుకుంటోందని తీవ్రంగా మండిపడ్డారు. ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని కేంద్రాన్ని ప్రాధేయపడుతున్నా వైకాపా సర్కార్​.. రాష్ట్రహోదా, అమరావతి, పోలవరం గురించి అడగడం లేదా? అని దుమ్మెత్తి పోశారు. ఏపీలో కొందరు వైకాపా సర్కారుకు పేటీఎం బ్యాచ్​లా తయారయ్యారని సంచలన ఆరోపణలు చేశారు.

" ఒక జడ్జి ఆంధ్రప్రదేశ్​కు వచ్చి ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని అంటున్నారు. ఏపీలోని దారుణ పరిస్థితులు ఈ జడ్జిలకు పట్టవా?. రాష్ట్రంలో కొన్ని పేటీఎం బ్యాచ్‌లు తయారయ్యాయి. ఆత్మహత్యలు, అల్లకల్లోలాలు ఆ జడ్జిలకు కనపడవా! ఒక నేరస్థుడికి ఇలాంటివారు మద్దతు ఇవ్వవచ్చా!"

--చంద్రబాబు, తెదేపా అధినేత

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఉద్దేశించి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. "ఒకాయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. కుమారుడికి పదవి తీసుకుని జగన్‌ను పొగుడుతున్నారు" అని చంద్రబాబు విమర్శించారు. రిటైర్‌ అయ్యాక వీరికి( ఈ మాజీ జడ్జీలకు) పదవులు కావాలని, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇదీ చూడండి:MOVIE TICKETS: సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో రద్దు చేసిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details