తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో ఉన్మాద పాలన నడుస్తోంది: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

వైకాపా పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎప్పుడూ చూడని ఉన్మాద పాలన ఏపీలో నడుస్తోందని మండిపడ్డారు. జగన్మోహన్​రెడ్డి ప్రచారం పిచ్చి పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు.

cbn
ఏపీలో ఉన్మాద పాలన నడుస్తోంది: చంద్రబాబు

By

Published : Oct 23, 2020, 10:54 PM IST

ఏపీ ముద్దాయిల ఇష్టారాజ్యంగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎప్పుడూ చూడని ఉన్మాదపాలన ఆంధ్రప్రదేశ్​లో నడుస్తోందని మండిపడ్డారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ‘ఉన్మాది పాలనలో ఊరికో ఉన్మాది’ తయారవుతున్నారని విమర్శించారు.

జగన్మోహన్​ రెడ్డి ప్రచారం పిచ్చి పరాకాష్టకు చేరిందని.. సర్వే రాళ్లపై కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయడం సరికాదని దుయ్యబట్టారు. కరోనా పరిస్థితులను సరిగ్గా ఎదుర్కొంటే ఏపీలో ఇన్ని సమస్యలు వచ్చేవికావని అభిప్రాయపడ్డారు.

ఇవీచూడండి:ఉదయం కార్లలో తిరుగుతూ రెక్కీ.. రాత్రి గ్యాస్​ కట్టర్లతో ఏటీఎం చోరీ

ABOUT THE AUTHOR

...view details