విశాఖ షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావును.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఓఆర్‌ఎస్ ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పల్లా.. ఈనెల 10న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్షను విరమింపజేసిన చంద్రబాబు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాసరావును ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. విశాఖ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో ఉన్న పల్లాకు ఓఆర్‌ఎస్ ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్షను విరమింపజేసిన చంద్రబాబు
సోమవారం అర్ధరాత్రి పల్లా ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చంద్రబాబు పర్యటనకు ముందే పల్లాను ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి:విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారు: చంద్రబాబు