ఏపీలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చనిపోయిన వారికి తెదేపా మహానాడు నివాళులు అర్పించింది. రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు పార్టీ తరపున రూ.50వేల సాయం ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. లాక్డౌన్ వల్ల విశాఖకు రాలేకపోయాయని అన్నారు.
విశాఖ ఘటన బాధితులకు 'మహానాడు' నివాళులు
ఏపీ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరపున రూ.50వేల సాయం ప్రకటించారు తెదేపా అధినేత చంద్రబాబు. మహానాడు తొలిరోజు విశాఖ ఘటన బాధితులకు నివాళులు అర్పించిన ఆయన..రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
విశాఖ ఘటన బాధితులకు 'మహానాడు' నివాళులు
మహానాడు తొలిరోజు ప్రారంభోపన్యాసం చేసిన చంద్రబాబు...వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖ బాధితులకు అండగా నిలబడ్డ ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. న్యాయం చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రంగనాయకమ్మ తదితరులపై కేసులు నమోదు చేయడం అమానుషమని ఆక్షేపించారు.
ఇవీ చూడండి:కరోనా వేళ కూలీల ఆశాదీపం 'ఉపాధిహామీ'