తెలంగాణ

telangana

ETV Bharat / city

TDP MLA: సీఎం జగన్​కు తెదేపా ఎమ్మెల్యే అనగాని లేఖ - తెలంగాణ వార్తలు

బీసీల కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాం అంటున్న జగన్ ప్రభుత్వం.. అందులో మళ్లించిన నిధుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. రెండేళ్లలో బీసీ కార్పొరేషన్ల నుంచి రూ.18,050 కోట్లు మళ్లించి.. బీసీల అభివృద్ధిని ప్రశ్నార్ధకం చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఆ రాష్ట్ర సీఎం జగన్‌కు లేఖ రాశారు.

TDP MLA letter, mla anagani Sathya prasad letter to jagan
తెదేపా ఎమ్మెల్యే అనగాని, జగన్‌కు తెదేపా ఎమ్మెల్యే లేఖ

By

Published : Aug 1, 2021, 4:24 PM IST

అభివృద్ధికి, రెక్కల కష్టానికి చిరునామాగా ఉండే బీసీల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. బీసీలను ఉద్దరించేశామంటూ చేస్తున్న ప్రసంగాలు, ప్రచారం పచ్చి మోసమని.. ఏపీ సీఎం జగన్‌కు రాసిన లేఖలో విమర్శించారు. రెండేళ్లలో బీసీ కార్పొరేషన్ల నుంచి రూ.18,050 కోట్లు మళ్లించి.. బీసీల అభివృద్ధిని ప్రశ్నార్ధకం చేశారని ఆరోపించారు. బీసీ అభ్యున్నతి పేరుతో హడావుడి చేస్తూ.. ఏ విధంగా బీసీల నిధులు మళ్లించారో సాక్ష్యాధారాలతో బయటపెడుతున్నట్లు తెలిపారు.

బీసీల కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాం అంటున్న జగన్ ప్రభుత్వం.. అందులో మళ్లించిన నిధుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 2019 - 20లో రూ.15వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించి అందులో రూ.10,478 కోట్లు మళ్లించారని.. 2020-21లో రూ.23వేల కోట్లు, 2021-22లో రూ.25వేల కోట్లు బీసీ కార్పొరేషన్ నుంచి మళ్లించారన్నారు. మిగిలిన సొమ్ములో కూడా అధిక భాగం పత్రికా ప్రకటనలకు వెచ్చించారే తప్ప.. బీసీల అభ్యున్నతి కోసం కాదని మండిపడ్డారు.

ఇదీ చదవండి:పాపం పిల్లలు.. నలుగురు ఆడపిల్లల్లో ఇద్దరు అలాంటివారే..!

ABOUT THE AUTHOR

...view details