తెలంగాణ

telangana

ETV Bharat / city

Tirumala Tickets : ఆన్​లైన్​లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు.. అరగంటలోనే ఖాళీ - ఏపీ న్యూస్

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు ఆన్​లైన్​లో విడుదలయ్యాయి. మొట్టమొదటిసారిగా తితిదే.. ఉచిత టికెన్లను ఆన్​లైన్ ద్వారా విడుదల చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు.. కరోనా నెగిటివ్ ధ్రువపత్రం ఉన్నవారే తిరుమలకు రావాలన్న నిబంధనలు విధించింది.

tirumala tickets
tirumala tickets

By

Published : Sep 25, 2021, 9:47 AM IST

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే అన్‌లైన్‌లో విడుదల చేసింది. ఉచిత దర్శన టికెట్లు తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం.. ఇతర సేవా టిక్కెట్ల మాదిరిగానే సర్వదర్శనం టిక్కెట్లను కూడా తితిదే వెబ్‌సైట్‌ ద్వారా పొందేలా సౌకర్యం కల్పించారు. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున తితిదే వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు.

సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ నెలకు సంబంధించిన కోటా విడుదల చేశారు. విడుదలైన అరగంటలోపే సర్వదర్శనం టికెట్లు ఖాళీ అయినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 31 వరకు సంబంధించిన కోటా టికెట్ల జారీ ముగిసింది. 35 రోజుల టికెట్లు కేవలం 30 నిమిషాల్లోనే బుక్ చేసుకున్నారు.

కరోనా కట్టడి, భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆన్‌లైన్‌ విధానం ఎంచుకున్నట్లు తితిదే తెలిపింది. ఆన్‌లైన్ టికెట్ల విడుదలతో ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. జియో సంస్థ సహకారంతో తితిదే వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు విడుదల చేస్తోంది. టిక్కెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్​ లేదా 72 గంటల ముందు పరీక్ష చేయించుకున్న కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్​తో తిరుమలకు రావాలని నిబంధనలు విధించింది.

ABOUT THE AUTHOR

...view details