తౌక్టే తుపాను ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షాలు పడతాయని... ఆ సమయంలో గంటకు 30 నుంచి40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 256 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని వెల్లడించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 60 ప్రాంతాల్లో వాన పడిందని తెలిపింది.
తౌక్టే తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు - tauktae cyclone
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఆది, సోమ వారాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని, పంటను కాపాడుకోవాలని సూచించింది.
తౌక్టే తుపాను, తెలంగాణపై తౌక్టే తుపాను, తెలంగాణలో వర్షాలు
రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని... ధాన్యం ఆరుబయట ఆరబోయవద్దని మార్కెటింగ్ శాఖ సూచించింది. రైతులు టార్పాలిన్ కవర్లను సిద్ధంగా ఉంచుకోవాలని మార్కెటింగ్ శాఖ తెలిపింది.
- ఇదీ చదవండి :కష్టాలు గెలిచారు.. కరోనాను ఓడించారు!