తెలంగాణ

telangana

ETV Bharat / city

రేపు హైదరాబాద్​కు తరుణ్​చుగ్​.. జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తు - state affairs Incharge Tarun Chugh

Ambedkar Vishwas Rally: రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. ఎస్సీ మోర్ఛా ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంబేడ్కర్‌ విశ్వాస్‌ ర్యాలీలో పాల్గొననున్నారు.

National Working Committee Meetings
National Working Committee Meetings

By

Published : Jun 7, 2022, 8:35 PM IST

Ambedkar Vishwas Rally: భాజపా సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. కార్యవర్గ సమావేశాల విజయవంతం కోసం పలు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం.. ఎస్సీ మోర్ఛా ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాం నుంచి అంబేడ్కర్‌ విశ్వాస్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరున్నరకు ప్రారంభమయ్యే ర్యాలీలో తరుణ్‌ చుగ్‌, బండి సంజయ్‌, కొలార్‌ ఎంపీ ముని స్వామి పాల్గొననున్నారు. ఈరోజు ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు వెళ్లిన జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లతో తరుణ్​చుగ్​ సమావేశమయ్యారు. ఈ భేటీలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోష్​ పాల్గొని కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బండిసంజయ్​, కె. లక్ష్మణ్​, మురళీధర్​రావు పాల్గొన్నారు.

BJP Hall Meetings: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల పాలనపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10నుంచి 15 వరకు హాల్‌ మీటింగ్‌లు నిర్వహించేందుకు పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 10న కూకట్‌పల్లిలో జరగనున్న హాల్‌ మీటింగ్​లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొంటారు. ఇతర ప్రాంతాల్లో జరిగే హాల్‌ మీటింగ్​లకు వక్తలుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మురళీధర్‌రావు, విజయశాంతి పాల్గొంటారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details