ఆంధ్రప్రదేశ్లోని కడప పెద్ద దర్గాను సినీ నటుడు తారకరత్న దర్శించుకున్నారు. దర్గాను దర్శించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. సినిమా చిత్రీకరణలో భాగంగా కడప వచ్చిన తారకరత్న ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గాను దర్శించారు. పూల చాదర్ సమర్పించి.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కడప పెద్ద దర్గాను దర్శించుకున్న తారకరత్న
ఏపీలోని కడప పెద్ద దర్గాను సినీ నటుడు తారకరత్న దర్శించుకున్నారు. దర్గాకు పూల చాదర్ సమర్పించారు.
కడప పెద్ద దర్గాను దర్శించుకున్న తారకరత్న
నిర్వాహకులు దర్గా విశిష్టతను తారకరత్నకు తెలియజేశారు. పెద్ద దర్గా గురించి గతంలో చాలామంది తన దృష్టికి తీసుకొచ్చారని.. ఇప్పుడు దర్శించుకునే భాగ్యం లభించిందని తారకరత్న పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమూలంగా తొలగిపోవాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: ప్రభాస్ పుట్టినరోజు బహుమతిగా 'కిల్లర్ అప్డేట్'