హైదరాబాద్ టపాచబుత్రలో ఎస్సైగా పనిచేస్తున్న మధుపై వేటు పడింది(SI Madhu suspension). ఎస్సై మధు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని... బేగంపేటకు చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈనెల 19న యువతి బలవన్మరణానికి(suiside attempt) యత్నించింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలోనే వివాహం అయిన మధు.. తనను రెండో వివాహం చేసుకుంటానని చెప్పి.. మొహం చాటేస్తున్నాడని బాధితురాలు వాపోయింది.
SI suspend: యువతి ఆత్మహత్యాయత్నం.. ఎస్సై సస్పెండ్ - ఎస్సైపై వేటు
టపాచబుత్రలో ఎస్సైగా పనిచేస్తున్న మధు సస్పెన్షన్(SI Madhu suspension) అయ్యాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ బేగంపేటకు చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న సీపీ అంజనీకుమార్... మధును విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలిచ్చారు.
si suspend
ఈ విషయమై ఈ నెల 12 టపాచబుత్ర సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న పశ్చిమ మండల డీసీపీని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్(CP Anjani Kumar) మధును విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలిచ్చారు.
ఇదీ చూడండి:Cyber Fraud: డేటింగ్ పేరుతో వలపు వల.. 77 ఏళ్ల వృద్ధునికి 11 లక్షలు టోకరా
Last Updated : Jul 21, 2021, 5:36 PM IST