తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్, రాజేంద్రప్రసాద్ - తిరుమలలో రాజేంద్రప్రసాద్

తిరుమల స్వామివారిని తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, సినీనటుడు రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్, నటులు
శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్, నటులు

By

Published : Sep 18, 2020, 6:18 PM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్ధప్రసాదాలు అందజేశారు.

సినీనటుడు రాజేంద్రప్రసాద్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ నుంచి సినిమా చిత్రీకరణలు పూర్తిస్థాయిలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి...మూడు ఖాళీల భర్తీ మరిచారు.. మూడు సింహాలు మాయమయ్యాయ్

ABOUT THE AUTHOR

...view details