ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలను పలువురు ప్రముఖులు సందర్శించారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్వామిసేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో తమిళనాడు సీఎం పళనిస్వామి - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం పళనిస్వామి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం పళనిస్వామికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం పళనిస్వామి
అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి పళనిస్వామి.. మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వీఐపీలను సగానికి పరిమితం చేసి.. సాధారణ భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పించాలని పొన్ రాధాకృష్ణన్ కోరారు.
ఇదీ చదవండి:దీపావళికి మోగిన టపాసులు.. గతేడాది పోలిస్తే తగ్గిన కాలుష్యం
TAGGED:
tn cm visit tirumala