తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తన రాజకీయ జీవితాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజలు తనను ఆదరించనందుకు బాధపడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ప్రజలు అంగీకరించేవరకు.. సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు. తెలంగాణ గవర్నర్గా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నై గిండిలోని ఓ హోటల్లో ఆమె ఓ పుస్తకాన్ని విడుదల చేశారు.
"నేను అనుకోకుండా తెలంగాణ గవర్నర్గా ఎంపికయ్యాను. కొత్త రాష్ట్రానికి అనుభవం లేని గవర్నర్ అని తీవ్ర విమర్శలు వచ్చాయి. పాత్రికేయులను నన్ను కలిసినప్పుడు వారికి నేను ఓ వైద్యురాలిని అని చెప్పుకున్నాను. ఇప్పుడు నన్ను తెలంగాణ ప్రజలు అంగీకరిస్తున్నారు. ఓ మహిళ రాజకీయ నేతగా ఎదగడం మామూలు విషయం కాదు. ఆమెకు ప్రతిసారి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి."- తమిళసై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్.