తెలంగాణ

telangana

ETV Bharat / city

23ఏళ్ల బహుదూరపు బాట'సారీ'.. గూడు చేరే లోపే గుండె ఆగింది! - Tamilanadu Guy Die With Heart Attack While Walking Maharashtra To Tamilanadu

లాక్​డౌన్ కారణంగా వాహనాలు లేక మహారాష్ట్ర నుంచి నడుచుకుంటూ వచ్చి హైదరాబాద్​ చేరాడు తమిళనాడు యువకుడు. అప్పటికే డీహైడ్రేషన్​ బారిన పడ్డాడు. తన సహచరులతో కలిపి మారేడ్​పల్లిలోని ప్రభుత్వ సహాయ కేంద్రానికి తరలించారు పోలీసులు. అప్పటికే అలసిన ఆ యువకుని గుండె గూడు చేరకముందే ఆగిపోయింది.

Tamilanadu Guy Die With Heart Attack While Walking Maharashtra To Tamilanadu
నడిచి నడిచి.. కానరాని లోకాలకు!

By

Published : Apr 3, 2020, 1:09 PM IST

కరోనా భయంతో కరోనా చిగురుటాకులా వణికిపోతుంటే.. భారతదేశం కరోనాను కట్టడి చేసేందుకు లాక్​డౌన్ ప్రకటించింది. ఎక్కడివారిని అక్కడే ఉంచి.. కరోనా వ్యాపించకుండా ఉండాలని సూచించింది. కానీ.. సామాన్య ప్రజానికానికి లాక్​డౌన్ కష్టకాలాన్ని తెచ్చిపెట్టింది. ఉపాధి కోసం రాష్ట్రాలు దాటిన వారంతా చేతిలో పని లేక తిరిగి సొంతూళ్లకు పయనమయ్యారు. రవాణా సౌకర్యం లేక.. వాహనాలు రోడ్డెక్కక.. కాలినడకనే ఊరి బాట పట్టారు. ఈ క్రమంలో సుదూర ప్రాంతాలకు నడిచి, తిండీ నిద్ర, నీళ్లు సమయానికి అందక... ఒత్తిడిని తట్టుకోలేక నానా యాతన పడుతున్నారు. ఆ క్రమంలోనే గుండె ఆగి ఓ యువకుడు ప్రాణాలు వదిలాడు.

నడిచి నడిచి.. కానరాని లోకాలకు!

తమిళనాడులోని నామక్కల్ జిల్లా పలిప్యాలం అనే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల లోకేష్ అనే యువకుడు మహారాష్ట్రలోని వాగ్ధాలో వ్యవసాయ శిక్షణ తీసుకుంటున్నాడు. లాక్​డౌన్ శిక్షణ ఆగిపోయింది. వాహన సౌకర్యం లేకపోవడం వల్ల తనతో పాటు శిక్షణ తీసుకుంటున్న 26 మందితో కలిసి కాలినడకన స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ నెల 1న రాత్రి బోయిన్​పల్లి మార్కెట్​కు చేరుకున్నారు. నడుచుకుంటూ వెళ్తున్న వారిని గమనించిన బోయిన్​పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ వారి వివరాలు కనుక్కున్నారు. పోలీసులకు సమాచారం అందించి వారిని మారేడుపల్లిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్​హాల్​కి తరలించి అక్కడే భోజనం, వసతి ఏర్పాటు చేశారు. మిగతా 26 మందితో కలిసి భోజనం చేసిన లోకేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానిక పోలీసులు, కార్పోరేటర్ వచ్చి చూడగా.. అప్పటికే లోకేష్ ప్రాణాలు వదిలాడు. గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.

మహారాష్ట్రలోని వార్ధా నుంచి తమిళనాడుకు 454 కిలోమీటర్ల దూరం. అయినా సరే.. ఎలాగైనా గూడు చేరాలని.. సొంతింటికి చేరితే చాలని నడక సాగించారు. తాము బయల్దేరిన ప్రాంతం నుంచి తమిళనాడు అంత దూరం ఉన్నా.. సొంతింటికి చేరాలనుకున్నారు. హైదరాబాద్ మీదుగా వెళ్తే వీలైనంత త్వరలో ఇళ్లకు వెళ్లవచ్చన్న అంచనాతో వారు బయల్దేరారు. బుధవారం నాటికి హైదరాబాద్ చేరుకొని గురువారం చీకటి పడే సమయానికి వారు తమ స్వస్థలానికి చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. ఎలాగోలా హైదరాబాద్​ చేరుకున్న వారిని పోలీసులు ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించారు.

అప్పటికే నష్టం జరిగిపోయింది. ఎక్కువ దూరం నడిచిన కారణంగా ఆ 27 మందిలో ఒకడైన లోకేష్ శరీరంలో నీటిశాతం ఆవిరైపోవడం, బాగా అలసిపోవడం వల్ల కుప్పకూలిపోయి గుండె ఆగి ప్రాణాలు వదిలాడు. శవ పరీక్షలు పూర్తయిన తర్వాత లోకేష్ మృతదేహాన్ని పోలీసులు అతని స్వస్థలానికి పంపించనున్నారు. మిగతా వారిని లాక్​డౌన్ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలని పోలీసులు సూచించారు.

ఇదీ చూడండి : అంబులెన్స్​ను అడ్డుకున్నారు

ABOUT THE AUTHOR

...view details