ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర మంత్రులు భరోసా కల్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని బన్సీలాల్పేట్లో ఇంటర్లో ఫెయిలై బలవన్మరణానికి పాల్పడ్డ అనామిక కుటుంబాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. విద్యార్థులు తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. రాజకీయ పక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తలసాని - ఇంటర్ బాధితుల కుటుంబాలకు పరామర్శ
పరీక్షలో విఫలమైనంత మాత్రాన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇంటర్లో ఫెయిలై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని సికింద్రాబాద్లో పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
ఇంటర్ విద్యార్థిని