కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో చర్చించారు. వ్యాధి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు.. ప్రజలు నిత్యావసరాల కోసం వచ్చి వెంటనే ఇళ్లకు వెళ్లాలని సూచించారు.
రానున్న రెండు రోజుల్లో రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. జనసమూహాలు లేకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలంతా అధికారులకు సహకరించి కరోనా వైరస్ తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ప్రతిరోజు రూ.150 కోట్ల నష్టం వచ్చినప్పటికీ ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని పునరుద్ఘాటించారు.