తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వచ్ఛ సర్వేక్షన్​ 2022లో రాష్ట్రానికి అవార్డుల పంట.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హర్షం.. - స్వచ్ఛ సర్వేక్షన్​ 2022 అవార్డులు

Swachh Survekshan 2022 awards: దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్​ 2022 అవార్డుల్లో రాష్ట్రానికి అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే 142 పట్టణ స్థానిక సంస్థలకు ఓటీఎఫ్​ హోదాలు రావడంతో తెలంగాణ ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఈ అవార్డుల విజయానికి కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు.

Swatch Survey 2022
స్వచ్ఛ సర్వేక్షన్​ 2022

By

Published : Sep 25, 2022, 10:33 AM IST

Swachh Survekshan 2022 awards: దేశవ్యాప్తంగా కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలు నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్​​ 2022 అవార్డుల్లో రాష్ట్రానికి 16 పట్టణ, స్థానిక సంస్థలకు అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.​ స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.

2021 జూలై నుంచి 2022 జనవరి కాలానికి జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, గార్జేజ్ ఫ్రీ సిటీ తదితర ప్రామాణికాల్లో రేటింగ్ ఇచ్చి అవార్డులను ప్రకటించారు. ఘన - ద్రవ వ్యర్థాల నిర్వహణ, లిట్టర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ స్థాయి కంపోస్టింగ్, పబ్లిక్ - కమ్యూనిటీ టాయిలెట్లు, ప్రజల భాగస్వామ్యం, వినూత్న పరిష్కారాలు తదితర 90 అంశాలను అవార్డులకు ప్రాతిపదికగా తీసుకొన్నారు.

అయితే స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా రాష్ట్రంలోని 16 మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు అవార్డులు దక్కినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. వీటితో పాటు రాష్ట్రంలోని 142 ప‌ట్టణ, స్థానికసంస్థలకు గాను 70 పట్టణాలకు ఓడీఎఫ్ ప్లస్ హోదా, 40 ప‌ట్టణాలకు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా దక్కాయి. ఒక పట్టణస్థానికసంస్థకు వాటర్ ప్లస్, మిగిలిన 31 ప‌ట్టణాలను ఓడీఎఫ్ గా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ప్రకటించింది.

రాష్ట్రం నుంచి బడంగ్​పేట కార్పొరేషన్, ఆదిభట్ల, భూత్పూర్, చండూర్, చిట్యాల, గ‌జ్వేల్, ఘ‌ట్ కేస‌ర్, హుస్నాబాద్, కొంప‌ల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరుడుచెర్ల, సిరిసిల్ల, తుర్కయాంజల్, వేములవాడ మున్సిపాల్టీలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్​లకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కాయి. ఈ ఎంపికైన పట్టణ, స్థానికసంస్థలకు అక్టోబ‌రు ఒకటో తేదీన దిల్లీలో అవార్డులు ప్రధానం చేస్తారు.

పురపాలక అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులను అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంస్కరణల ఫలితమే ఈ అవార్డులు. పట్టణాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. కేంద్రం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణ పల్లెలు కూడా భారీగా అవార్డులు సాధించడం ఆనందంగా ఉంది. గ్రామాలు, పట్టణాల అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు జాతీయ స్థాయిలో దక్కుతున్న అవార్డులే నిదర్శనం. ఇప్పటికే రాష్ట్రం వినూత్న విధానాలు, నిర్ణయాలతో అనేక రంగాల్లో దేశానికి దిక్సూచిగా, ఆదర్శ నమూనాగా నిలుస్తోంది. వరుసగా పట్టణాలకు దక్కుతున్న ఈ అవార్డుల ద్వారా పట్టణాభివృద్ధి, పురపాలనలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. - కేటీఆర్​, పురపాలక శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details