తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం కోసం శారదా పీఠం ప్రచారం - Swarupananda_Swamy visit to hyderabad

తెలుగు రాష్ట్రాల్లో హిందూ సనాతన ధర్మం కోసం శారదా పీఠం ప్రచారం చేస్తోందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం కోసం శారదా పీఠం ప్రచారం

By

Published : Nov 11, 2019, 5:09 AM IST

Updated : Nov 11, 2019, 8:15 AM IST

హిందూ ధర్మం కోసం శారదాపీఠం అనేక కార్యక్రమాలు చేపడుతోందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు.
తెలంగాణలో రెండో విడత హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి జలవిహార్ ఎండీ రామరాజు ఇంటికి చేరుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం కోసం శారదా పీఠం ప్రచారం

స్వాత్మానందేంద్ర సరస్వతి హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా 45 రోజుల పాటు తెలంగాణలో 2,600 కిలోమీటర్లు తిరిగారని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా స్వాత్మానందేంద్ర స్వామి పర్యటిస్తారని వెల్లడించారు.

ఇప్పటి వరకు ఆయన 26 జిల్లాల్లో పర్యటించారని..మిగిలిన ఏడు జిల్లాల్లో ఈనెల 12వ తేదీ నుంచి పర్యటిస్తారని తెలిపారు. వరంగల్​లో కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటివద్ద ప్రారంభమైన ప్రచారం..ప్రస్తుతం రామరాజు ఇంటికి చేరుకుందని వెల్లడించారు.

Last Updated : Nov 11, 2019, 8:15 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details