ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడలోని స్వర్ణప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం కేసులో నిందితులను.. మంగళవారం మచిలీపట్నంలోని ప్రత్యేక సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆసుపత్రి సిబ్బంది ముగ్గురికి.. విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు ఆసుపత్రి, హోటల్ యాజమాన్యాలను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం: నిందితులకు 14 రోజులు రిమాండ్ - విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం వార్తలు
స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం నిందితులకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆసుపత్రి సిబ్బంది ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నం ప్రత్యేక సబ్‌జైలుకు నిందితులను తరలించారు.
![స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం: నిందితులకు 14 రోజులు రిమాండ్ స్వర్ణప్యాలెస్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8385785-422-8385785-1597193924771.jpg)
స్వర్ణప్యాలెస్