హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గ పరిధి తులసినగర్ కాలనీలో సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు కిరాణా సరకులు పంపిణీ చేశారు. బియ్యం, పప్పు, వంట నూనె, చింతపండు, ఉప్పు, కూరగాయలతో కూడిన కిట్లను 100 మందికి పంపిణీ చేశారు. గత 45 రోజులుగా నగరంలో సరుకులు పంచుతున్నామని తెలంగాణ గంగపుత్ర మహిళా సభ పిలుపు మేరకు తులసినగర్‌లో సరకులు పంచామని ఫౌండేషన్ ఛైర్మన్ రాజేష్ బెస్త తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆర్థిక కష్టాల్లో ఉన్న మహిళామణులను ఆదుకోవాలనే లక్ష్యంతో సరకులు అందించామని రాజేష్ స్పష్టం చేశారు.
సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిరాణా సరుకుల పంపిణీ
కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో పేదలు ఉపాధి కరవై ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల దాతలు, సంస్థలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. ఈ తరుణంలో సువర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబర్‌పేట నియోజకవర్గ పరిధి తులసినగర్ కాలనీలో నిరుపేదలకు నిత్యావసరాలు వితరణ చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మహిళా సభ ప్రెసిడెంట్ అరుణ జ్యోతి బెస్త, ప్రిన్సిపల్ అడ్వైజర్ పద్మ బెస్త వారి కార్యవర్గానికి రాజేశ్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా ఇప్పట్లో పూర్తిగా తగ్గే అవకాశం లేనందున ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. మహిళలకు సరకుల కిట్లు పంపిణీ చేసిన సువర్ణ ఫౌండేషన్‌కు మహిళా సభ కార్యదర్శి, గ్రేటర్ హైదరాబాద్ మహిళా మోర్చ ప్రధాన కార్యదర్శి అనితా బెస్త కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాకే తమ పనులు చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు విజయ్ కుమార్, ధనలక్ష్మి, భాజపా మహిళా నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :పోతిరెడ్డిపాడుపై కేంద్రమంత్రికి ఉత్తమ్ ఫోన్
TAGGED:
దాతల సాయం.. నిరుపేదలకు అభయం