తెలంగాణ

telangana

ETV Bharat / city

6 నెలల క్రితం జరిగిన యువకుడి మృతిపై అనుమానాలు.. ఈ వీడియోనే సాక్ష్యం..! - ఆర్నెళ్ల క్రితం జరిగిన యువకుడి మృతిపై అనుమానాలు

ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు చనిపోయాడనుకున్న యువకుడి మృతిపై కొత్తగా అనుమానాలు తలెత్తుతున్నాయి. యువకుని మరణానికి ముందు తీసిన వీడియోనే ఇందుకు కారణమవుతోంది. తమ కుమారున్ని కావాలనే హత్య చేసి దాన్ని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Suspicions over the death of a young man six months ago because this Video
Suspicions over the death of a young man six months ago because this Video

By

Published : Feb 19, 2022, 7:45 PM IST

ఆర్నెళ్ల క్రితం జరిగిన యువకుడి మృతిపై అనుమానాలు.. ఈ వీడియోనే సాక్ష్యం..!

గతేడాది ఆగస్టు 24న సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు మరణించాడనుకున్న ఓ యువకుడి మృతిపై తాజాగా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ యువకుడు మరణించడానికి ముందు తీసిన ఓ వీడియో.. వెలుగులోకి రావటమే ఇందుకు కారణం. ఈ వీడియో చూసిన తల్లిదండ్రులు తన కొడుకును కావాలనే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులకు వీడియో చూపించి విచారణ చేప్పట్టమని అడిగితే.. తమనే దూషిస్తున్నారని హైదరాబాద్​ ప్రెస్​క్లబ్​లో బాధిత తల్లిదండ్రులు గోడువెళ్లబోసుకున్నారు. తమ కుమారుడు శివరాం మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని.. పోలీసులు సమగ్ర విచారణ జరిపించిన న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.

వీడియోలో ఏముందంటే..

"ఇద్దరు అబ్బాయిలు ఒడ్డున నిలబడి ఉన్నారు. ఇంకో ఇద్దరు నీళ్లలో ఉన్నారు. అందులో ఒకబ్బాయి మాత్రం.. అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకొకతను మాత్రం అతడి ప్రయత్నాన్ని నివారిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ క్రమంలోనే బయట ఉన్న వాళ్ల కామెంట్లు.. తనని చంపేయి అన్నట్టుగా వినిపిస్తున్నాయి. ఇంతలోనే బయట ఉన్న ఇద్దట్లో ఒకరు లోపలికి వెళ్లి.. అతడి తలను పట్టుకుని లోపలికి నొక్కుతున్నాడు. వీళ్ల నుంచి తప్పించుకునేందుకు మాత్రం ఆ అబ్బాయి గింజుకుంటున్నాడు. ఈ తంతంగాన్నంతా మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు."- ఇది వీడియో సారాంశం..

నల్గొండ జిల్లా చంద్రంపేటకు చెందిన రామునాయక్ కుటుంబం సైదాబాద్​లో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. రామునాయక్​, లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. మొదటివాడైన శివరాం(18) ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గతేడాది ఆగస్టు 23న.. తమ దూరపు బంధువైన లక్​పతి శివరాంకు ఫోన్​ చేశాడు. తీజ్ పండుగ సందర్భంగా నక్కలగండికి తీసుకెళ్లాడని రామునాయక్​ తెలిపారు. అక్కడికి వెళ్లిన తన కుమారుడు మళ్లీ తిరిగి రాలేదన్నాడు. అప్పటి నుంచి తనకున్న అనుమానం... ఈ వీడియో చూశాక నిజమైందని ఆరోపించాడు. తన కొడుకును వాళ్లే హత్య చేసి ప్రమాదంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపిస్తున్నాడు.

మాకు న్యాయం చేయండి..

"తీజ్​ పండుగ కోసం లక్​పతి మా కొడుకు శివరాంను పంపించాలని అడిగాడు. మేం వద్దన్నాం. కానీ.. సాయిరాం అనే అబ్బాయికి ఫోన్​పేలో డబ్బులు వేసి.. శివరాంను తీసుకురావాలని చెప్పి పంపించాడు. ఆగస్టు 23న శివరాంను సాయిరాం తీసుకెళ్లాడు. నేను ఫోన్​ చేసి అడిగితే.. క్యాటరింగ్​ వెళ్తున్నామని రాత్రి వరకు వచ్చేస్తామని చెప్పారు. తెల్లారి(ఆగస్టు 24న) మధ్యాహ్నం ఫోన్​ చేసి మీ కొడుకు నక్కలగండి దగ్గర చనిపోయాడని చెప్పారు. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్తే.. పోయేసరికి చీకటైంది. అప్పటికి పోలీసులు కూడా ఉన్నారు. నా కొడుకు వాళ్లే కొట్టి చంపారని పోలీసులకు చెప్తే.. మేం కేసు పెడతామని చెప్పి సంతకాలు తీసుకున్నారు. తర్వాత అడిగితే.. సరిగ్గా పెంచలేదని పోలీసులు మమ్మల్ని తిట్టారు. అప్పటి నుంచి నేనే అక్కడ ఇక్కడా తిరుగుతూ.. అన్ని విషయాలు తెలుసుకున్నా. అప్పుడు ఈ వీడియో దొరికింది. అన్ని సాక్ష్యాలు పట్టుకుని పోలీసుల దగ్గరికెళ్తే.. మమ్మల్నే తిట్టి పంపించేశారు. హెచ్చార్సీ కోర్టులో కూడా జడ్జీకి వీడియో చూపిస్తే ఏసీపీని కలమమన్నారు. అయినా న్యాయం జరగలేదు. ఆరు నెలలైంది నా కొడుకు చనిపోయి. అన్ని సాక్ష్యాలు తీసుకెళ్లి పోలీసులకు చూపించినా నాకు న్యాయం చేస్తలేరు. నా కొడుకును ఎందుకు చంపారు..? వాళ్లను ఎవరు చంపమన్నారు..? చంపాల్సినంత పెద్ద తప్పు ఏం చేశాడో..? మాకు తెలియాలి. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి."- రామునాయక్​, శివరాం తండ్రి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details