Shilpa kala Vedika Bandobastu: ముస్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ కామెడీ షో నిర్వాహణపై గందరగోళం నెలకొంది. హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళావేదికలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు సాయంత్రం శిల్పకళావేదికలో జరిగే మునావర్ ఫారూఖి కామెడీ షో అడ్డుకుంటామని భాజపా నాయకులు హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు వారం క్రితమే ఇప్పటికే భాజపాకి చెందిన పలువురు కార్యకర్తలు షోకు హాజరయ్యేందుకు టిక్కెట్లు కొనుగోలు చేశారని జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను ముందస్తు అరెస్టు చేసి లాలాగూడ పీఎస్‌కి తరలించారు. నిన్న పోలీసులు ఎమ్మెల్యేను గృహనిర్బందం చేసే ప్రయత్నం చేశారు. ఆయన తన నివాసం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.