Monkeypox case in AP : ఆంధ్రప్రదేశ్లో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదైంది. ఒంటిపై దద్దుర్లతో ఉన్న 8 సంవత్సరాల బాలుడిని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. రెండు వారాలు గడిచినా నయం కాకపోవడంతో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు.
ఏపీలో మంకీపాక్స్ కలకలం.. గుంటూరులో అనుమానిత కేసు - Suspected monkeypox case in Guntur news
Monkeypox case in AP : ఏపీలో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదైంది. ఒంటిపై దద్దుర్లతో ఉన్న 8 సంవత్సరాల బాలుడిని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. నమూనాలను తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు.
ఏపీలో 8 ఏళ్ల బాలుడిలో మంకీపాక్స్ లక్షణాలు.. గాంధీ ఆసుపత్రికి నమూనాలు
నివేదికను అనుసరించి తదుపరి కార్యాచరణ ఉంటుందని జీజీహెచ్ అధికారులు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు.. ఒడిశా నుంచి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం బాలుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.