తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయ ప్రదానం - చంద్రప్రభ వాహనం

TIRUMALA BRAHMOTSAVALU: వైకుంఠనాథుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారు సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. సూర్యప్రభ వాహన సేవను దర్శించుకుంటే ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయ ప్రదానం
తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయ ప్రదానం

By

Published : Oct 3, 2022, 12:01 PM IST

తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయ ప్రదానం

TIRUMALA BRAHMOTSAVALU: తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి‌. ఏడో రోజు ఉదయం మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభవాహన సేవను దర్శించుకుంటే ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. స్వామివారికి కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. తిరువీధుల్లో కళాబృందాల ప్రదర్శనలు యాత్రికులను అలరించాయి. నేడు సాయంత్రం స్వామి వారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

సూర్యప్రభ వాహనం: సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సిద్ధిస్తాయి.

ABOUT THE AUTHOR

...view details