తెలంగాణ

telangana

ETV Bharat / city

లొంగిపోయిన 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు .. ఎక్కడంటే - Maoists latest news

Surrender of 700 Maoist sympathizers: ఏపీలో ఏవోబీ ప్రాంతంలో సుమారు 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఇంత మంది లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో మావోలకు పెద్ద దెబ్బతగిలిందని పోలీసులు తెలిపారు.

మావోయిస్టు
మావోయిస్టు

By

Published : Sep 17, 2022, 9:34 PM IST

Surrender of 700 Maoist sympathizers: ఆంధ్రప్రదేశ్​లో ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్​లో శనివారం దాదాపు 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు ఈరోజు ఆంధ్రహల్ గ్రామ సమీపంలో గల 65 బీఎస్ఎఫ్ బెటాలియన్ శిబిరం వద్ద సానుభూతిపరుల లొంగుబాటు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోరాపుట్ పోలీస్ డీఐజీ రాజేష్ పండిట్, బీఎస్ఎఫ్ డీఐజీ మదన్​లాల్ తదితరులు సమక్షంలో వివిధ గ్రామాల ప్రజలు లొంగిపోయారు.

ఇందులో భాగంగా ఒడిశా కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాతో పాటు.. అల్లూరి జిల్లా రంగబయలు పంచాయతీకి చెందిన పట్న పడాల్పుట్, కోసంపుట్ గ్రామాలకు చెందిన వారుసైతం ఉన్నారు. మొత్తం 700 మంది లొంగిపోగా అందులో 13మంది రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. మారుమూలప్రాంతాల్లో అభివృద్ధికి పోలీసులతో కలిసి పని చేస్తామని వారంతా హామీ ఇచ్చారు.

అనంతరం పోలీసులు గిరిజనులకు పలు సామగ్రి పంపిణీ చేశారు. భారీ స్థాయిలో సానుభూతిపరులు లొంగిపోవడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టులపై ప్రభావం చూపనుందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details