Hydernagar Land Case Update: హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ భూముల కేసుకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌లో ఏవైనా లోపాలు ఉంటే సవరించుకొని దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. హైదర్‌నగర్ సర్వే నం: 172లోని 98 ఎకరాల భూములు తమవేనంటూ ఓ వైపు గోల్డ్‌స్టోన్ కంపెనీ, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మరికొందరు కూడా సుప్రీంలో పిటిషన్లు వేశారు. ఈ మేరకు జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. గోల్డ్‌స్టోన్ తరపున న్యాయవాది వికాస్‌సింగ్ వాదనలు వినిపించారు.
హైదర్‌నగర్ భూముల కేసులో రాష్ట్రానికి సుప్రీం సూచన - హైదర్‌నగర్ భూముల కేసు తాజా సమాచారం
Hydernagar Land Case Update హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ భూముల కేసుకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌లో ఏవైనా లోపాలు ఉంటే సవరించుకొని దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. హైదర్‌నగర్ సర్వే నం 172లోని 98 ఎకరాల భూములు తమవేనంటూ ఓ వైపు గోల్డ్‌స్టోన్ కంపెనీ, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపి తీర్పు వెలువరించింది.
ఆ భూముల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడు దశాబ్దాల పాటు పట్టించుకోలేదు. వాటితో తమకు సంబంధం లేదని 2004లో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ స్థలాలు తమవే అంటూ మూడేళ్ల నుంచి పిటిషన్లు దాఖలు చేస్తోంది. హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం, ఇతరులు పదేపదే పిటిషన్లు వేస్తున్నారు అని ధర్మాసనానికి వివరించారు. ఆయన వాదనలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు విభేదించారు. తమ పిటిషన్ ఇప్పటివరకు విచారణకే రాలేదని చెప్పారు. తాము మరో పిటిషన్ వేస్తామని తెలిపారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం.. సవరించిన పిటిషన్‌ను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులకు సూచిస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 7వ తేదీకి వాయిదా వేసింది.