తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు - సర్వోన్నత న్యాయస్థానం

supreme-notices-to-central-and-state-governments-on-sc-classification-and-reservation
ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

By

Published : Aug 10, 2022, 2:09 PM IST

Updated : Aug 10, 2022, 3:08 PM IST

14:07 August 10

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు

Supreme Court on SC Classification and Reservation: ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పిటిషన్​ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర సర్కారులకు నోటీసులు జారీ చేసింది. రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్లు లేక నష్టపోతున్నామని ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు మందకకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరినట్టు మందకృష్ణ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి తెలుసుకుంటామని కోర్టు తెలిపిందన్న మందకృష్ణ.. తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.

"రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్లు లేక నష్టపోతున్నాం. ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టును కోరాం. వర్గీకరణపై కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరాం. కేంద్ర, రాష్ట్రాల వైఖరి తెలుసుకుంటామని కోర్టు తెలిపింది. వర్గీకరణ జరిగితేనే ఉప కులాలకు న్యాయం జరుగుతుంది. మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం." - మంద కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు

ఇవీ చూడండి:

Last Updated : Aug 10, 2022, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details