SC ON SHIVA SHANKAR BAIL PETITION : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివేకా హత్య కేసులో బెయిల్ ఇవ్వాలని సుప్రీంలో శివశంకర్‌రెడ్డి పిటిషన్ వేయగా.. బెయిల్ మంజూరు చేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.
వివేకా హత్య కేసు నిందితుడికి బెయిల్ నిరాకరించిన సుప్రీం - ap latest news
SC ON VIVEKA MURDER: దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వివేకా హత్యకేసులో బెయిల్ మంజూరు చేయాలన్న శివశంకర్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చింది.
వివేకానంద హత్య కేసు
సుప్రీంకోర్టుకు శివశంకర్‌రెడ్డి.. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సెప్టెంబర్ 20న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంలో పిటిషన్ వేశారు. సీబీఐ, వైఎస్ సునీతను ప్రతివాదులుగా చేర్చారు. శివశంకర్‌రెడ్డి తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
ఇవీ చదవండి: