ఏపీ సర్కారుపై.. సుప్రీం కోర్టులో ఒడిశా ప్రభుత్వం వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ జరిగింది. తమ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని ఆరోపిస్తూ.. ఒడిశా సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఎం ఖాన్ విల్కర్ ధర్మాసనం విచారణ జరిపింది.
ఒడిశా పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయనగరం కలెక్టర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోటియా పరిధిలో ఉన్న 3 గ్రామాలు.. ఏపీకి చెందినవేనని ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. మూడు గ్రామాల్లో గతంలోనూ ఎన్నికలు నిర్వహించినట్లు వివరించారు.