నిర్దిష్ట అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈసీ అనుమతి ఇవ్వకపోతే అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని చెప్పింది. ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలన్న పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది.
అభివృద్ధి పనుల ప్రారంభానికి ఈసీ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాన్ని సవరించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఎన్నికల కోడ్ అమలులో లేనప్పుడు ఈసీ అనుమతి ఎలా తీసుకుంటామని రోహత్గి వాదించారు. ఎన్నికలు రద్దు చేయలేదని, వాయిదా మాత్రమే వేశామని ఈసీ తరఫు న్యాయవాది పరమేశ్వరి వాదించారు.