సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ - Telangana Secretariat Demolition Latest News
13:33 October 15
సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ
రాష్ట్ర సచివాలయం కూల్చివేతపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. లేకపోతే యథాతథస్థితిని పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ ఉల్లంఘనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనానికి పిటిషన్‌ను బదిలీ చేశారు.
ఇవీచూడండి:'కొత్త సచివాలయ నిర్మాణం... సుప్రీం తీర్పునకు విరుద్ధం'
TAGGED:
తెలంగాణ సచివాలయం కూల్చివేత