పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేశ్‌రెడ్డికి బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సత్యం రెడ్డి... జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనాన్ని కోరారు. తీవ్ర నేరారోపణలతో పాటు పలువురి పోలీసుల ప్రమేయం ఉన్న ఈ కేసులో పూర్తి వాదనలు వినకుండా బెయిల్ మంజూరు చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
చిగురుపాటి జయరాం హత్యకేసు నిందితుడి బెయిల్‌పై సుప్రీంలో విచారణ - సుప్రీంకోర్టు తాజా విచారణలు
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. నెలలు గడుస్తున్నా పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయలేదని.. అందువల్ల రాకేశ్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.
చిగురుపాటి జయరాం హత్యకేసు నిందితుడి బెయిల్‌పై సుప్రీంలో విచారణ
కేసు పురోగతి వివరాలు తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో కేసు పురోగతి అంశాలతో సమగ్ర నివేదిక అందజేస్తామని తెలంగాణ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అందుకు అంగీకరించిన జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.
ఇదీ చూడండి:అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు డబ్బు చెల్లించేందుకు అనుమతి ఇవ్వండి: ఏపీ ప్రభుత్వం